లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని

leelemmu kraistavundaa neeloo meelkoni

🎵 AKK-365💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని ||లేలెమ్ము క్రైస్తవుఁడా||

1వ చరణం

విడువకు యుద్ధము నుడువకబద్ధము యొడయుఁడు నీకడ నుండును బాయఁడు ||లేలెమ్ము క్రైస్తవుఁడా||

2వ చరణం

విడువకు ధైర్యము వదలకు కవచము సదయుఁడు క్రీస్తుఁడు సత్ఫల మిచ్చును ||లేలెమ్ము క్రైస్తవుఁడా||

3వ చరణం

బెదరకు మేరికి వదలకు దారిని నది యిది కానిది యాత్మను బెట్టక ||లేలెమ్ము క్రైస్తవుఁడా||

4వ చరణం

ప్రార్థన సారము వర్ధిలఁ గోరుము సార్థక కాలము వ్యర్థము చేయక ||లేలెమ్ము క్రైస్తవుఁడా||

5వ చరణం

భావములోనన్ దేవుని ప్రేమన్ నీవది వేఁడుచు నెమ్మదిఁ గూడుచు ||లేలెమ్ము క్రైస్తవుఁడా||

6వ చరణం

యేసుని సిలువ నెదుట బెట్టుకో మోసము నొందవు యేసుని కాపున ||లేలెమ్ము క్రైస్తవుఁడా||

Report Error