శోధనకు మీరు చోటియకుఁడి ధైర్యము

shoodhanaku meeru chootiyakundi dhairyamu

🎵 AKK-369💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శోధనకు మీరు చోటియకుఁడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు సాతానుకు లొంగఁ బాపం బగును. ||శోధనకు మీరు||

1వ చరణం

దుర్భుద్ధి కుభాష మానుండు సదా పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీ దేవుని పేరున్ దూషింపకయు శ్లాఘించుచు మీరు వర్ధిల్లుఁ డిలన్

2వ చరణం

జయించెడువారు సౌందర్య ప్రభన్ చారు మకుటంబు ధరించెదరు ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ముఁ డాయనె నిత్యంబు సాయము నిచ్చున్

Report Error