నా దేవ ప్రభువా నీ

naa deeva prabhuvaa nee

🎵 AKK-370💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైన శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా

1వ చరణం

ప్రయాణకుండను నడవిలో నా త్రోవఁ జీఁకటి కమ్మినను నిద్రించుచుండఁగా స్వప్నంబునందున నీ చెంతనుందును నా ప్రభువా.

2వ చరణం

యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబుఁ జేరనుఁ జూడనిమ్ము. నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చఁగా నీ చెంతనుందును నా ప్రభువా.

3వ చరణం

నేనిద్రలేవఁగా నా తండ్రి, నే నీకుం గృతజ్ఞతఁ జెల్లింతును. నే చావునొందఁగా ఇదే నా కోరిక నీ చెంతనుందును నా ప్రభువా.

Report Error