జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవరించి
jeevitanbu ghoora kashtanashtanbul aavarinchi
పల్లవి
జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి ఈవులెంచుము నీ వాశ్చర్య మొందెదవు. వానికై. ||జీవితంబు ఘోర||
1వ చరణం
చింతమానసంబు నీకు గల్గినన్ వంతచే భారంబు గల్గ నీయెదన్ సంతసంబుతోడ నెంచుమీవులన్ వింత నొందెదవు నీవు వానికై
2వ చరణం
నాశనంబు జెందు నాస్తి జూడగా వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన భాసురంపు భాగ్యముం దలంపుమా యీ సౌభాగ్యమే గదా సదా యుండు
3వ చరణం
జీవితాదియందు ధైర్య మొందుము దేవుడుండు నెల్లవార్కి తోడుగ జీవయాత్ర యందు సాయమియ్యగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు.