పల్లవి
ఓ మా తండ్రి నీదు నామము నిత్య మెన్ను చుండు గాక సకల లోకము క్షేమముగను విమలముగను జెన్ను మిరగఁ బరలోక ధాముఁడవై వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య ||ఓ మా||
1వ చరణం
నీ రాజ్యంబు రా నిమ్ము నీదు చిత్తము నేటుగఁ బరలోకమందున నే రీతిగను జేయఁబడునో యీ భూలోకమందు నట్టి దారి బొందఁ జేయవలెను ధర్మ మూర్తి సత్యవర్తి ||ఓ మా||
2వ చరణం
నేటి యాహారంబు మాకుఁ గరుణఁజేసి నేటి కిచ్చి సూటి పరచుమి మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప నీవె మాకు వేరె లేరు సుమ్ము ||ఓ మా||
3వ చరణం
మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరలఁ జేయు మమ్ము నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే మాదు ప్రార్థ న నమ్ముఁ జేకొమ్ము ఆమేన్ ||ఓ మా||