పరమ నందుండెడు మా పరమ

parama nandundedu maa parama

🎵 AKK-374💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు నరుగు దెంచుఁగాక పరమునందు నెట్టులనో ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుఁగాక ||పరమ నందుండెడు||

1వ చరణం

మా యనుదినాహారము మాకు నేఁడు దయచేయుము మా యెడలను దప్పిదములఁ జేయువారి నైఁచునట్లు మాయపరాధము క్షమించి మము శోధనలోకిఁ దేక మహిని గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా జ్యమ్ము శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్ ||పరమ నందుండెడు||

Report Error