ఆలించు దేవా నా మనవుల

aalinchu deevaa naa manavula

🎵 AKK-375💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ ||ఆలించు దేవా||

1వ చరణం

సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు నెల్లప్పుడు ||ఆలించు దేవా||

2వ చరణం

పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి కాసంతైన ||ఆలించు దేవా||

3వ చరణం

నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ సుతుని కృతమున ||ఆలించు దేవా||

4వ చరణం

నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ డించు మనిశంబు ||ఆలించు దేవా||

5వ చరణం

నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను కృపచే ||ఆలించు దేవా||

Report Error