దేవా సహాయము నిమ్మా జీవంపు

deevaa sahaayamu nimmaa jeevanpu

🎵 AKK-376💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవా సహాయము నిమ్మా జీవంపు టూటలు ద్రావుట కిమ్మా ||దేవా సహాయము||

1వ చరణం

గడియ గడియకు నెగసెఁ నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక బాణములు ఎగతెగని శోధనములు నీవు పడఁగొట్టి వేగమె దృఢభక్తి నిమ్మా ||దేవా సహాయము||

2వ చరణం

కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు సాతాను సాధనములు నేను దాఁటి నీ రెక్కల చాటున నుండ ||దేవా సహాయము||

3వ చరణం

దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ||దేవా సహాయము||

4వ చరణం

మా యావువుదినములు చెట్టు చాయవలెఁ దరుగుచు మంటి పాలౌను చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు ||దేవా సహాయము||

5వ చరణం

మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా ||దేవా సహాయము||

Report Error