యేసు పరలోక నాయక సువి

yeesu paralooka naayaka suvi

🎵 AKK-379💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు పరలోక నాయక సువి శేష సుఫల ప్రదాయక దోషరహిత ప్ర క్రాశ స్వయ ఛిద్వ లాస పరమ ని వాస బుధ దేవ ||యేసు పరలోక||

1వ చరణం

మంచి మనసాక్ష్య మియ్యవే శ్రమల నెంచి కృపల నందియ్యవే వంచనల నెడ లించి మొఱ చిత్త గించి మిగుల రక్షించు మిఁక వేగ ||యేసు పరలోక||

2వ చరణం

నీరసుఁడ నని పోనాడక యొద్దఁ జేరి నిర్దయఁ జూడక సారస త్కృప లూరననుఁ బ్రోచు వార లెవ్వ రున్నారు నీవుఁ గాక ||యేసు పరలోక||

3వ చరణం

కన్నతండ్రి నీ పాదముల్ పొడ గన్న వారి హృద్భేదముల్ అన్ని దొల గునని యన్న శుభరవం బెన్ని విన్నాఁడ నన్నవగు క్రీస్తు ||యేసు పరలోక||

4వ చరణం

శంకలను వెడలఁగొట్టవే లోకా టంకముల నెత్తి మొట్టవే యింక నా యఘ పంకమును గృప నింక గను నిష్క ళంకునిఁగఁ జేయు ||యేసు పరలోక||

5వ చరణం

దిక్కు నీవని నమ్మితి నిన్నే మ్రొక్క పంతంబుఁ జేసితి చక్కగా నల పి శాచి దుర్మోహ దృక్కణం నీ చక్కిఁ జేర్చు మో ||యేసు పరలోక||

Report Error