నిన్ను నేను విడువను దేవ

ninnu neenu viduvanu deeva

🎵 AKK-381💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు ||నిన్ను నేను||

1వ చరణం

నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను నేను||

2వ చరణం

త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను నేను||

3వ చరణం

నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి ||నిన్ను నేను||

4వ చరణం

ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని ||నిన్ను నేను||

5వ చరణం

నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు చేవ గలుగఁ జేయఁ గలవు ||నిన్ను నేను||

6వ చరణం

అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి ||నిన్ను నేను||

7వ చరణం

నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి ||నిన్ను నేను||

Report Error