యేసు, నీ సదాత్మ వృష్టి

yeesu, nee sadaatma vrushti

🎵 AKK-385💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు, నీ సదాత్మ వృష్టి భక్తు లెల్లవారిపై నీవు కుమ్మరింపఁగాను నాపైఁ గుమ్మరించుమీ. ||యేసు, నీ||

1వ చరణం

తండ్రి, నన్ను దాఁటవద్దు పాపి నంచు వేఁడెదన్ నీ మన్నింపు నీదు కృప నా కనుగ్రహించుమీ

2వ చరణం

రక్షకా, నన్ దాఁటి పోకు నేను నిన్ను నమ్మితిన్ నీదు దయ పూర్తిగాను నాపైఁ గుమ్మరించుమీ.

3వ చరణం

పావనాత్మ, దాఁటి పోకు నేను గుడ్డివాఁడను జ్ఞానదృష్టి నాకు నిమ్ము నాకు దైవ శక్తి నీ.

4వ చరణం

మాఱనట్టి దైవ ప్రేమ. క్రీస్తు రక్త పుణ్యము పావనాత్మ ప్రేరణంబు నిండుగాను బోయుమీ.

5వ చరణం

నన్ను దాఁటిపోక యేసు నీకు సేవచేయ నా హృదయంబును బంధించి నన్నాశీర్వదించుమీ

Report Error