ఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు మీశ
aasheeravanbu lmaameenda varshinpajeeyu meesha
పల్లవి
ఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు మీశ యాశతో నమ్మి యున్నాము నీసత్య వాగ్దత్తము. ||ఆశీరవంబు ల్మామీఁద||
1వ చరణం
ఓ దేవ పంపింప వయ్యా నీ దీవెన ధారలన్ మా దాహ మెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్
2వ చరణం
మామీఁద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీఁద క్షామంబు పోనట్లుగన్.
3వ చరణం
ఈనాఁడె వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేఁడి సన్నుతిఁ బ్రార్థింతుము.