విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ
vishvaasamutoo veendedi vaariki vishva
విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును వీల్పడును శాశ్వత రాజ్య థీశ్వరుఁ డాఢ్యుఁడు శాశ్వత మగు నీ శాసన మె చ్చెను ||విశ్వాసముతో వేఁడెడి||
బిడ్డలు తండ్రుల వేడఁగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ తండ్రి నిలఁ దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును ||విశ్వాసముతో వేఁడెడి||
నమ్మకమునఁ జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వాసముతో వేఁడెడి||
వెతకెడు వారికి వెసఁ గృపఁ జూపును గతిఁ గని వేడం గాఁ దెర చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేఁడగ నెంత యు మేలగు ||విశ్వాసముతో వేఁడెడి||
బల మేమియుఁ గనఁ బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు నలయకు నేలను నావగింజ మరి నిలిపినఁ జెట్టయి నింగికి నెదుగదె ||విశ్వాసముతో వేఁడెడి||
అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా భువిఁ బాపాత్ములఁ బ్రోచెడు ప్రభు కృపఁ జవిఁ జూడుము నుతి సల్పుచు వేగమే ||విశ్వాసముతో వేఁడెడి||