వెరువనేల మనసా క్రీస్తుని వేఁడవే
veruvaneela manasaa kreestuni veendavee
వెరువనేల మనసా క్రీస్తుని వేఁడవే నా మనసా యిరుకునఁ బడి యెడు వేళలోఁ క్రీస్తుని చరణము చేరువ జేరిన సుఖ మది ||వెరువనేల మనసా||
శోధన కాలమునఁ క్రీస్తుని బోధకు చెవి నిమ్మా సాధించెడు సా తానుని వల మరి ఛేదించెడు నిఁకఁ బెదరకు ||వెరువనేల మనసా||
పాపపు స్త్రీ వచ్చి పరిమళ తైలము తాఁ దెచ్చి పాప మెడలు నని తనలో ననుకొని యేపున క్రీస్తుని నెలమి భుజించెను ||వెరువనేల మనసా||
గ్రుడ్డివాడు నిలిచి మార్గము బడ్డ యేసుని బిలచి చెడ్డవాడనని చేయివిడువకు మన దొడ్డ క్రీస్తు కందోయి నొసంగెను ||వెరువనేల మనసా||
గాసి బడుచు రోగి యగు చెలి యాశచేత వచ్చి వాసిగ యేసుని వస్త్రమంటి సుఖ వాసి యయ్యె ప్రభు యేసుని కృపచే ||వెరువనేల మనసా||
లాజరుండు మృతుడై పడువే ళ సమాధికి వచ్చి లాజరా యని బల్కరుణను బిలువఁగ రాజిల బ్రతికెను బ్రాణాన్వితుఁడై ||వెరువనేల మనసా||
పరిసయ్యునిలోని భావము ప్రభు తాఁ గనుఁగొనుచుఁ తిరిగి పొమ్ము నీ దురితము వెడలెను వెరువకు మని యాదరముగ బలికెను ||వెరువనేల మనసా||