దినదినముకు దిక్కు నీవే మా

dinadinamuku dikku neevee maa

🎵 AKK-402💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడ నెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినముకు దిక్కు||

1వ చరణం

పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁ గావు మమ్ముఁ గావు మమ్ము ||దినదినముకు దిక్కు||

2వ చరణం

పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁ బ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినముకు దిక్కు||

3వ చరణం

కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతో చూపుదువే చూపుదువే ||దినదినముకు దిక్కు||

4వ చరణం

నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు కాలమందుఁ దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినముకు దిక్కు||

5వ చరణం

సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు నిలిపితివే నిలిపితివే ||దినదినముకు దిక్కు||

6వ చరణం

ఆసఁ గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము ||దినదినముకు దిక్కు||

7వ చరణం

విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగఁ బంపించుమీ శ్రేష్టముగను శ్రేష్ఠముగను ||దినదినముకు దిక్కు||

Report Error