దేవుఁడే నా కాశ్రయంబు దివ్యమైన

deevundee naa kaashrayanbu divyamaina

🎵 AKK-405💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవుఁడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము మ హా వినోదుఁ డాపదల స హాయుఁడై నన్ బ్రోచును అభయ మభయ మభయ మెప్పు డానంద మానంద మానంద మౌఁగ ||దేవుఁడే నా||

1వ చరణం

పర్వతముల కదిలిన నీ యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ అభయ మభయ మభయ ||దేవుఁడే నా||

2వ చరణం

దేవుఁ డెప్డు తోడుగాఁగ దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయ మభయ మభయ ||దేవుఁడే నా||

3వ చరణం

రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా వైరిఁ బూని సంహరించును అభయ మభయ మభయ ||దేవుఁడే నా||

4వ చరణం

విల్లు విఱచు నాయన తెగ బల్లెము నఱకు నాయన చెల్లచెదర జేసి రిపుల నెల్లఁద్రుంచు నాయనే అభయ మభయ మభయ ||దేవుఁడే నా||

5వ చరణం

పిశాచి పూర్ణబలము నాతోఁ బెనుఁగులాడ జడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును అభయ మభయ మభయ ||దేవుఁడే నా||

6వ చరణం

కోటయు నాశ్రయమునై యా కోబు దేవుఁ డుండఁగ ఏటి కింక వెరవ వలయు నెప్డు నాకుఁ బండుగ యభయ మభయ మభయ ||దేవుఁడే నా||

Report Error