కొండల తట్టు నేఁ గోర్కెతోడ

kondala tattu neen goorketooda

🎵 AKK-412💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స హాయంబు కలుగును ||కొండల తట్టు||

1వ చరణం

ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ ||కొండల తట్టు||

2వ చరణం

నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా పాడు వాఁడు కున్కఁడు ||కొండల తట్టు||

3వ చరణం

నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు నీకు నీడగా నగుఁ ||కొండల తట్టు||

4వ చరణం

ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను మార్కొనంగఁ జాలవు ||కొండల తట్టు||

5వ చరణం

ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ గాచును నీ ప్రాణముఁ గాపాడును ||కొండల తట్టు||

6వ చరణం

మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు నిను యెహోవా కాచును ||కొండల తట్టు||

7వ చరణం

జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు యుగ ముల కగుఁ గా కామేన్ ||కొండల తట్టు||

Report Error