ఓ దేవా నన్నుఁ బ్రోవ

oo deevaa nannun broova

🎵 AKK-415💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భార మయ్య రావే ||ఓ దేవా||

1వ చరణం

స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం ||ఓ దేవా||

2వ చరణం

నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం ||ఓ దేవా||

3వ చరణం

కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే డను నా భారం సంతరింప నీ భారం ||ఓ దేవా||

4వ చరణం

మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ ప గ నా భారం నన్ను గా వనీ భారం ||ఓ దేవా||

Report Error