నాధ యేసు నాధ క్రీస్తు

naadha yeesu naadha kreestu

🎵 AKK-416💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నాధ యేసు నాధ క్రీస్తు నాధ నేననాధ సాధు జనులఁ బ్రోచు సదయు నీ దయ కాదా ||నాధ యేసు||

1వ చరణం

గతిఁ దలఁపని మూర్ఖచిత్త గమనుఁడనే గానా సతతముననుఁ గరుణఁ బ్రోచెడు గతియ నీవు కావా ||నాధ యేసు||

2వ చరణం

పాపమందు జననమైన పామరుండ నేఁగానా కటకట ననుఁ గని కరించు కరుణ నీది గాదా ||నాధ యేసు||

3వ చరణం

కుటిల బుద్ధిగల వాఁడను క్రూరుఁడ నేఎఁగానా కటకట ననుఁ గని కరించు కరుణ నీది గాదా ||నాధ యేసు||

4వ చరణం

ఆది కర్త వీవు గావె యఖిల లోకమునకును బీదవారి నెల్లఁ బ్రోచు బిరిదు నీది గాదా ||నాధ యేసు||

5వ చరణం

సారమైన సత్యశాస్త్ర సార మీవు గావా ఘోరమైన పాపి జనులఁ గోరి పిలువ లేదా ||నాధ యేసు||

6వ చరణం

జీవ నాధారమైన త్రోవ నీవు గావా దేవదేవ యెహవా నా దిక్కు నీవు గావా ||నాధ యేసు||

Report Error