ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తిసాధన ములకు మూలము భక్తిగొని యానంద మొందరే ||ముక్తిఁ గనరే||
పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మది మీకిడుదునని పరమరక్షకుఁ డాన తిచ్చెను ||ముక్తిఁ గనరే||
ఇచ్ఛయించెడు వాఁడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చు కొనుగా కనుచుఁ బల్కెను సచ్ఛరితుఁడు మనుష్య పుత్రుఁడు ||ముక్తిఁ గనరే||
ఆకసమునందుండి యిటు దిగి లోకమునకుఁ జీవము నొసఁగునది ఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము ||ముక్తిఁ గనరే||
నేనె మార్గము నేనె సత్యము నేనె జీవము నావలననే గాని యెపఁడును తండ్రి యొద్దికి రానలవిగాదని వచించెను ||ముక్తిఁ గనరే||
జీవజలము నుద్రావుటకు మీ భావన లనెడి పాత్ర ముంచుచు చేవఁ గొని పానించుచు నిరత జీవమును వెలుఃగొంది బ్రతుకను ||ముక్తిఁ గనరే||
ఎక్కడను యిటువంటి ప్రభువును మక్కువను వేసారి వెతకిన చిక్క(బో డిటువచ్చి జూడుడి గ్రక్కునను జేసట్టు డిప్పుడే ||ముక్తిఁ గనరే||