శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ
sharanun jochchiti yeesunaadhunda shaktiheenatan
పల్లవి
శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే ||శరణుఁ జొచ్చితి||
1వ చరణం
కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే ||శరణుఁ జొచ్చితి||
2వ చరణం
మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో ||శరణుఁ జొచ్చితి||
3వ చరణం
తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే ||శరణుఁ జొచ్చితి||
4వ చరణం
శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి మాయ లోకపు గాంతి నీరస మంచు నీ ||శరణుఁ జొచ్చితి||