పల్లవి
యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి ||యెహోవ నా||
1వ చరణం
పచ్చిక చోట్లలోఁ బండఁ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకుఁ జక్క గా నడిపించు ||యెహోవ నా||
2వ చరణం
ఆయన దయతో నా యా యాసములఁ దీర్చి న్యాయమార్గములందు ననుఁ బట్టి నడిపించు ||యెహోవ నా||
3వ చరణం
గాడాంధకార మా ర్గమున నేఁ దిరిగినను గాఢంపు గృపతోడఁ గరుణించు నన్నెపుడు ||యెహోవ నా||
4వ చరణం
నీవు తోడై యుండ నిర్భయం బగు నాకుఁ కావవచ్చును దుడ్డు కఱ్ఱయును దండంబు ||యెహోవ నా||
5వ చరణం
నా శత్రువుల నడుమ నాకు భోజన మొసఁగి యాశ తీరంగఁ ద లంటె నూనెను బోసి ||యెహోవ నా||
6వ చరణం
నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా దయలు వెంటాడు ||యెహోవ నా||
7వ చరణం
పరమానందముతోడఁ బ్రభు సన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు ||యెహోవ నా||