సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా మా
sarvashaktunda nirmalaatmunda sarvajanasanrakshakaa maa
సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా మా సర్వపాపముఁ బరిహరింప నీ సర్వమహిమను విడితివా ||సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ||
నిత్యనాశనమగ్నులగుమా నిత్యశాపముఁ బాపి మరి నీ నిత్య జీవము మాకునీయను మృత్యు బాధలు పడితివా ||సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ||
పాపమరణపు బంధకములనుఁ దెంపి మము విడిపించుటకు మా పాపమును భరించి మాకై యాపదల పాల్పడితివా ||సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ||
మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి జీవము నిచ్చితివి కా బట్టి యిఁక నీ కట్టడలలో దిట్టముగ బలపరుచుమీ ||సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ||
సత్యవిధులలో నడువనే న శక్తుఁడనో రక్షకా నీ భృత్యునికి శక్తి నిత్యమిడి నడి పింపు నీ ఘనసేవలో ||సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ||
నీదు నామము మహిమపరుచను నాదు జీవితకాలమున బహు సాధు నిగ ననుఁ జేసి సాయము నాధుఁడా నాకీయుమా ||సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ||
ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుఁజేతు నీ స్తోత్రముల్ పర వస్తు ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ నిరీక్షింతున్ ||సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ||
ముక్తినుంచి నీవు రాగా శక్తితోఁ ప్రభు యేసువా యా సక్తితో నినుఁ గూడుకొని బహు యుక్తస్తోత్రముల్ జేతుము ||సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ||