శరణు శరణు యేసు దేవా నన్నుఁ గరుణింపవే నిత్య జీవా పరమ దేవుని తనూ భవుఁడవై ధరణిలో నర రూపమైతివి నరులను రక్షింప ||శరణు శరణు||
దైవోగ్రమునకుఁ బాత్రుఁడను విమల భావమునకే నసహ్యుఁడను గావరించిన పాప కర్ముఁడన్ కఠినుఁడన్ జానవలసిన యట్టి స్వామి ద్రోహు డ నయ్య ||శరణు శరణు||
మద మత్సరమ్ములు మెండై నాదు మది నాక్రమించెను నిండై సదయుండ నీ దివ్య సర్వాజ్ఞలన్ మీరి విదితముగఁ బాపముల్ వేడ్కను జేసితి ||శరణు శరణు||
మోసంబులోఁ జిక్కి చాల నేను దోసంబు చేసితినిల యేసు నాధుని సిలువ నేమాత్రమైన నే నాసతోఁ జూడని యన్యాయ పరుఁడను ||శరణు శరణు||
నెమ్మ దించుక యైన మదిలో లేక గ్రమ్ముకొని యఘము నా యెదలోఁ ద్రిమ్మరినై భువిన్ దిరిగి వేసారఁగ సమ్మతము దొరక దో సర్వేశ నీకంటె ||శరణు శరణు||
నా తండ్రి యో యేసునాధా నిన్ను ఘాతఁజేసిన దేనుగాదా నీతిమాలిన పాప నీచుఁడన్ దుష్టుఁడన్ నా తప్పు క్షమియించి నన్నేలి రక్షించు ||శరణు శరణు||
కడుదయా శాంతస్వభావా నన్ను దడవుజేయక యేలుకోవా యొడబడి కుజనులకై యోర్చియలసటను బడి జీవమిడిననా ప్రాణ రక్షక కావు ||శరణు శరణు||