నా రక్షకుని వెంబడింతు నన్నిటన్

naa rakshakuni venbadintu nannitan

🎵 AKK-426💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్లుదున్ బరమ కిరీట మొందువరకు. ||నా రక్షకుని||

1వ చరణం

నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలై భయ పడన్ దయఁ జూపు యేసు నన్ను వెం డించుచో భయ మేల భువనంబులోదగన్

2వ చరణం

నా కాలమెల్ల యేసుసందునమ్ము దున్ భీకరింపు వాధియైన నేదాటుదున్ నా కర్తతోడ నెందునైన నేగుదున్ నాక మెక్కితండ్రిఁ చువరకున్.

Report Error