యేసూ, నా ప్రభువా, నీ

yeesoo, naa prabhuvaa, nee

🎵 AKK-427💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసూ, నా ప్రభువా, నీ ప్రేమ లేకున్న నా యాత్మ కేదియు విశ్రాంతి నియ్యదు. ||యేసూ, నా||

1వ చరణం

యేసూ, రేబగుళ్లు నా యొద్ద నుండుము నాతో నీవుండిన నే భయ ముండదు.

2వ చరణం

సుఖంబుఁ బొందఁగా నిన్నే యాశింతును దుఃఖంబు నొదఁగా నీవే శరణ్యము.

3వ చరణం

నీ మార్గమందున నే నడ్వ నేర్పుము నీ మాట చొప్పున నన్నున్ దీవించుము.

4వ చరణం

నిన్నే యాశింతును యేసూ, నా ప్రభువా నీవంటివాఁడనై నన్నుండఁ జేయుము.

Report Error