నడ్పుమీ, మహా యెహోవా లోక

nadpumee, mahaa yehoovaa looka

🎵 AKK-429💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నడ్పుమీ, మహా యెహోవా లోక యాత్ర యందున నీదు శక్తి నాకు దిక్కు నన్ రక్షింపఁ జేఁపట్టు దివ్య మన్నా, దివ్య మన్నా నా కాహారమై యుండు.

1వ చరణం

ఊటగా స్వచ్ఛజలంబు బండనుండి పారనీ అగ్ని మేఘ స్తంభాలచే నడవిన్ నన్ దాఁటించుఁ గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూ నాకు డాలవు సదా.

2వ చరణం

యొర్దాన్ నది దాఁటు వేళ భీతు లెల్లఁ బాపుము మృత్యు శ్రమ లన్ని నన్ను క్షేమ కానాన్ జేర్చును స్తుతి గీతి, స్తుతి గీతి నీ కర్పింతు నిత్యము

Report Error