ఆహా నాకేమానందము శ్రీ యేసు

aahaa naakeemaanandamu shree yeesu

🎵 AKK-431💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆహా నాకేమానందము శ్రీ యేసు నాచేఁ బట్టుచు సహాయుఁడై నాయన్నిటన్ సజీవుఁడై నడుపును. ||ఆహా నాకేమానందము||

1వ చరణం

యేదే స్సుఖంబు లైనన్ సదా విచార మైనను బాధాంధకార మైనను ముదంబుతోడ నుందును.

2వ చరణం

చింతేల నాకు నీ దయన్ సంతత మీవు తోడుగాన్ బంతంబు నీచేఁ బట్టుచు సంతృప్తితో నే నుందును.

3వ చరణం

నా చావు వేళ వచ్చినన్ విచార మొందక ధృతిన్ నీ చేయి బట్టి యేసుఁడా నీ చారు మోక్ష మెక్కుదున్

Report Error