యేసు భక్తవరులతో ని వాసముందమ

yeesu bhaktavarulatoo ni vaasamundama

🎵 AKK-434💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు భక్తవరులతో ని వాసముందమ యేసుదాసు లౌదమ ||యేసు భక్తవరులతో||

1వ చరణం

దోసములను తీగలన్ని కోసివేతమ మిగుల మోసపుచ్చు నాసలెల్ల రోసివేతమ యేసుదాసు లౌదమ ||యేసు భక్తవరులతో||

2వ చరణం

దోసిలొగ్గి ప్రభునివేడ గాసి పడుదమ వాసిగాను యేసుమీద నాసపడుదమ యేసు దాసు లౌదమ ||యేసు భక్తవరులతో||

3వ చరణం

జారచోర దుష్కృతములు పారవేతమ సత్య సార మెరుగ బరమ గురుని జేరు కొందమ యి(క కోరు కొందమ ||యేసు భక్తవరులతో||

4వ చరణం

ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును యేసు శాపరాసులన్ని తానే యోపి మోసెను తండ్రి దాపొసంగును ||యేసు భక్తవరులతో||

5వ చరణం

శరణుజొ చ్చు నందరకును దురిత మెంచక ఘోర మరణ బాధలెల్ల దీర్చి పరమొసంగును స్ధిర వరము లిచ్చును ||యేసు భక్తవరులతో||

6వ చరణం

లోక భోగముల మదిన్ని రాకరింతమ ప్రభు రాక కెదురు జూడ మన మేక మౌదమ ఇపుడె యేక మౌదమ ||యేసు భక్తవరులతో||

Report Error