యెహోవా మా తండ్రి గాఁడ

yehoovaa maa tandri gaanda

🎵 AKK-435💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా మా||

1వ చరణం

మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా మా||

2వ చరణం

అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా మా||

3వ చరణం

పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా మా||

4వ చరణం

తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా మా||

5వ చరణం

పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా మా||

6వ చరణం

కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా మా||

Report Error