రమ్ము శ్రీ యేసూ సమ్మతి

rammu shree yeesoo sammati

🎵 AKK-437💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మనమున నిలువ నిమ్ము నా పెదవుల నీతి అగ్నిచే నంటఁ గ్రమ్మర నా నత్తి వదలి నీ కృపఁ బొంద ||రమ్ము శ్రీ||

1వ చరణం

నిన్ను స్తుతింతు నీ కృప నెపుడు నెన్ని కీర్తింతుఁ బన్ను గ నీ కృప ని న్నెన్నఁ డెరుఁగని నరుల కన్న యేసున్నా నీ ధన్య రుధిరమె చాలు ||రమ్ము శ్రీ||

2వ చరణం

తరమె యెన్నఁగను దత్కృపను భూ నభముల నైనన్ నిరతము నీ ప్రేమ నీతి పరిమితిచే ధరఁ దేజో వాసులకుఁ గలిగించుఁ గడు వింత ||రమ్ము శ్రీ||

3వ చరణం

భవదీయ కృపను బాగుగఁ జాటి భువి నీ చిత్తమును అవిధి నెం చక తీర్చి యమిత బలముతోడ నవగతి నీతి కి రీటంబు నేఁ బొంద ||రమ్ము శ్రీ||

4వ చరణం

నేను నీ కొరకే నిత్యము బ్రతికి నిన్ను గణుతించి మానుగ 'భళా' యను మంచి వాక్యము విని దీన ప్రభుని సమా ధానములో నేఁ జేర ||రమ్ము శ్రీ||

Report Error