సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య

sanpoorna parishuddhi nimmu satya

🎵 AKK-439💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా ||సంపూర్ణ పరిశుద్ధి||

1వ చరణం

నిర్మల మనసు రంజిల్ల నిత్య పరమానందంబు నా యాత్మలో నెరపు ధరణి శ్రమల నోర్పు నిమ్ము పాప పరితాప మనుదినం బభివృద్ధిపరచి ||సంపూర్ణ పరిశుద్ధి||

2వ చరణం

విశ్వాస సమృద్ధి నిమ్ము నాదు ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం తోషంబుగ సేవించుటకు నీదు నాశీస్సు దయచేయు దాస పోషకుఁడా ||సంపూర్ణ పరిశుద్ధి||

3వ చరణం

నాలోఁ గృతజ్ఞత నింపు నన్నుఁ బాలించు ప్రభునికై బ్రతుకంగ నిమ్ము చాల తనదు మహిమఁ బొగడి సర్వ కాలంబు దన వాక్కుఁ గని పెట్టునట్లు ||సంపూర్ణ పరిశుద్ధి||

4వ చరణం

నా పాపములె యేసునాధున్ ఘోర తాపా నిర్యాణంబు లందింపఁ జేసెన్ నా పాపములకు దుఃఖింతున్ దేవ కాపాడుమీ నన్నుఁ బాపంబునుండి ||సంపూర్ణ పరిశుద్ధి||

5వ చరణం

పెక్కంత శుద్ధిని బొంది నేను ఇక్కట్లు నోడింప శక్తి నందిమ్ము చిక్కులఁ బడి యుండునపుడు నీతి లోకమం దా సక్తి మిక్కుట పరచి ||సంపూర్ణ పరిశుద్ధి||

6వ చరణం

నీ రాజ్య ప్రవేశ మంది తండ్రి యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము యేసు ధరణి నీవలె నేను వర్తించునట్లు ||సంపూర్ణ పరిశుద్ధి||

Report Error