నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు

naavanni yangeekarinchumee deevaa nannepudu

🎵 AKK-441💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహు ధైర్య మొందెద ||నావన్ని యంగీకరించుమీ||

1వ చరణం

నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీఁదుఁగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని యంగీకరించుమీ||

2వ చరణం

సత్యంబు నీ ప్రేమ చక్కఁగా మదిఁ బూని నిత్యంఉఁ గరముల నీ సేవఁ జేసెద ||నావన్ని యంగీకరించుమీ||

3వ చరణం

నీ సేవ జరిగెడు నీయాలయమునకు నాసచే నడిపించు మరల నా పదములు ||నావన్ని యంగీకరించుమీ||

4వ చరణం

పెదవులతో నేను బెంపుగ నీ వార్తఁ గదలక ప్రకటింపఁ గలి గించు దృఢ భక్తి ||నావన్ని యంగీకరించుమీ||

5వ చరణం

నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమీ యావంతయైనను నాశింప మదిలోన ||నావన్ని యంగీకరించుమీ||

6వ చరణం

నీవు నా కొసఁగిన నిర్మల బుద్ధిచే సేవఁ జేయఁగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని యంగీకరించుమీ||

7వ చరణం

చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్లకుండఁగ మార్గంబుఁ దెలుపుము ||నావన్ని యంగీకరించుమీ||

8వ చరణం

హృదయంబు నీ కిత్తు సదనంబుగావించి పదిలంబుగా దానిఁ బట్టి కాపాడుము ||నావన్ని యంగీకరించుమీ||

Report Error