సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్

srushtipitaa sarvoonnataa samarpintun sarvasvamun

🎵 AKK-447💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్

1వ చరణం

భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే బలశౌర్యములు నీవే ||సృష్టిపితా సర్వోన్నతా||

2వ చరణం

మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టిపితా సర్వోన్నతా||

3వ చరణం

వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టిపితా సర్వోన్నతా||

4వ చరణం

పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు ||సృష్టిపితా సర్వోన్నతా||

5వ చరణం

మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా యెహోవా మా తనువుల్ మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టిపితా సర్వోన్నతా||

6వ చరణం

మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? మోక్ష నాధా యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టిపితా సర్వోన్నతా||

7వ చరణం

తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్ దాత వీవే నేతవీవే దేవాది దేవుండవే ||సృష్టిపితా సర్వోన్నతా||

Report Error