నే నీవాఁడనై యుండఁ గోరెదన్

nee neevaandanai yundan gooredan

🎵 AKK-454💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నే నీవాఁడనై యుండఁ గోరెదన్ యేసు ప్రియ రక్షకా నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్నుఁ జేర్చు నీదరిన్ ||నే నీవాఁడనై||

1వ చరణం

నన్నుఁ బ్రతిష్ఠపర్చుమీ నాధా నీదు కృపవల్లనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగున్

2వ చరణం

నీదు సన్నిధిలో నిఁక నుండ నెంత తుష్టి నాకగున్ స్నేహితుని మాటలాడెదన్ సర్వశక్త ప్రభుతో

3వ చరణం

నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్ఠత నే ననుభవించెదన్

Report Error