యేసుసామి నీకు నేను నా

yeesusaami neeku neenu naa

🎵 AKK-455💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుసామి నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును ||యేసుసామి నీకు||

1వ చరణం

యేసుసామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే.

2వ చరణం

నేను నీవాడను యేసు నీవును నావాడవు నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము.

3వ చరణం

నీకు నన్ను యేసు ప్రభూ ఈయనేనె యేగితి నీదు ప్రేమశక్తి నింపు నీదుదీవె నియ్యవే.

4వ చరణం

యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము.

Report Error