సంతసంబున వత్తు సర్వేశ్వరుని చిత్త
santasanbuna vattu sarveeshvaruni chitta
పల్లవి
సంతసంబున వత్తు సర్వేశ్వరుని చిత్త మెంతయు నెరవేర్చను వంతలు విడి నాదు నంతరంగము కదుర నెంతో విశ్వాసమున వెంట వత్తును బ్రభువా ||సంతసంబున వత్తు||
1వ చరణం
సురుచిరమగు మరియ సూనుని యాజ్ఞలు శిరమున నిడికొందును మరియ మనసుతో మర్తమ్మ కరములతోఁ బరమ సౌఖ్యముఁ బొంద భక్తితో సేవింతు ||సంతసంబున వత్తు||
2వ చరణం
నారాజు సేవ దు ర్భరమై బాధగ నున్న భారంబుగను దోఁచదు సారెసారెకుఁ దనదు చక్కని చిఱునవ్వు వారించి భారమున్ ధీరత నొస గును ||సంతసంబున వత్తు||
3వ చరణం
కారుణ్యమున నాదు కల్మషమయ హృదయ భారములను మోసితి ఆ రాజ్యమునఁగల యాస్తికై నా చిత్త మాలసింపఁగ నెత్తి యందే స్థిరముగ నుంచు ||సంతసంబున వత్తు||
4వ చరణం
ఈ యుర్వి నేఁజేయు సేవకు ఫలములు నీ చోటఁ గనుఁగొందునే కాయం బీధర కర్మలం గరపిన నా యాస్తి నా హృదయ మాలో కమున మండు ||సంతసంబున వత్తు||