లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు

lemmu teejarillumu neeku velugu

🎵 AKK-465💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము తేజరిల్లుము||

1వ చరణం

జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము తేజరిల్లుము||

2వ చరణం

సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము తేజరిల్లుము||

3వ చరణం

గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద క్షేత్రము గొప్పగజేతు ||లెమ్ము తేజరిల్లుము||

4వ చరణం

నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు నిన్ను కారణముగ జేతు ||లెమ్ము తేజరిల్లుము||

5వ చరణం

ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె ఎంతో బలమగు జనమగును ||లెమ్ము తేజరిల్లుము||

Report Error