కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో

karrunaayutan baukaaryamulu kanabadavalegaadaa manaloo

🎵 AKK-466💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ ||కఱుణాయుతం బౌకార్యములు||

1వ చరణం

పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక ||కఱుణాయుతం బౌకార్యములు||

2వ చరణం

కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము ||కఱుణాయుతం బౌకార్యములు||

3వ చరణం

పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ||కఱుణాయుతం బౌకార్యములు||

4వ చరణం

మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక ||కఱుణాయుతం బౌకార్యములు||

5వ చరణం

కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ ||కఱుణాయుతం బౌకార్యములు||

Report Error