రేపు మాపు గూడరమ్య మైన

reepu maapu goodaramya maina

🎵 AKK-467💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రేపు మాపు గూడరమ్య మైన గింజల్ ప్రీతితోను జల్లి వేచియుందము కాపుతోడ నుండి దాపు నుండు పంట ఏపు మీరఁ పంటఁకోసి కొందము ||రేపు మాపు||

1వ చరణం

సందియంబు లేల స్వామి సేవ యందు వందనంబు తోడ విత్తుచుందము కొందలంబు లేక కష్టవృత్తి చేసి యందరంబు చేరి యానందింతము

2వ చరణం

ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకు రంబుల్ ప్రీతిన్ కాల మెల్ల ప్రాంతమం తటన్ సేమ మొప్ప నాటినాయకుండు రాఁగన్ నిండు పంటఁ కోసం గూర్చుకొం దము.

Report Error