ఓడ్డుచేరి నీ యెదుట నిల్పునపుడు

oodducheeri nee yeduta nilpunapudu

🎵 AKK-471💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓడ్డుచేరి నీ యెదుట నిల్పునపుడు రక్షకా ఒక్క యాత్మనైన తేక సిగ్గుపడిపోదునా. ||ఓడ్డుచేరి నీ||

1వ చరణం

ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచు వారానాడు చింతతోడ నిల్తురు.

2వ చరణం

యేసువా! నా స్వరక్షణ నిశ్చయంబు యైనదే ఐనఫలితంబుజూడ కష్టపడనైతినే.

3వ చరణం

కాలమెల్ల గడ్చిపోయెన్ మోసపోతినేనయ్యో గడ్చినట్టి కాలమైతే ఏడ్చినను రాదది.

4వ చరణం

భక్తులారా! ధైర్యంతోడ లేచి ప్రకాశించుడీ ఆత్మలెల్ల యేసుయొద్ద చేరునట్లు చేయుడి.

Report Error