వద్దు మనస బుద్ధి కురుచ

vaddu manasa buddhi kurucha

🎵 AKK-473💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో ||వద్దు మనస||

1వ చరణం

చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక ||వద్దు మనస||

2వ చరణం

నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో ||వద్దు మనస||

3వ చరణం

ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక ||వద్దు మనస||

4వ చరణం

బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక ||వద్దు మనస||

5వ చరణం

పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక ||వద్దు మనస||

6వ చరణం

మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక ||వద్దు మనస||

Report Error