పరదేశుల మో ప్రియులారా మన

paradeeshula moo priyulaaraa mana

🎵 AKK-483💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగఁ ||పరదేశుల మో||

1వ చరణం

చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||పరదేశుల మో||

2వ చరణం

సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణఁగున్ నిజముగఁ ||పరదేశుల మో||

3వ చరణం

స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగఁ ||పరదేశుల మో||

4వ చరణం

మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనఁబడవే నిజముగఁ ||పరదేశుల మో||

5వ చరణం

ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగఁ ||పరదేశుల మో||

6వ చరణం

ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల మో||

7వ చరణం

వచ్చితి మిచటికి వట్టి హస్తములఁ దెచ్చిన దేదియు లే దు గదా ||పరదేశుల మో||

8వ చరణం

ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికిఁ ||పరదేశుల మో||

9వ చరణం

యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నినుఁ జేర్చున్ బరమున ||పరదేశుల మో||

10వ చరణం

యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ||పరదేశుల మో||

Report Error