ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి
ghanamaina kreestu krupan ganugonti
ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి నిపుడు ఘనుఁడు తన మహిమచేఁ గాఁచి పెంచెను నన్ను ||ఘనమైన క్రీస్తు||
ఆపదలలో మునిఁగి యడలుచుండఁగ నన్ను ఁ జేపట్టెను చింత చే జెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించి స్ధిరపరచె నిపుడు ||ఘనమైన క్రీస్తు||
ఘనమైన యాపదల కడలిలో ఁ బడి యున్న ఘనుఁడు నా దెసఁ జూచి మనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్నుఁ గరుణింతు నిప్పుడె వెనుకఁ జూడక తనదు వెంట రమ్మనెను ||ఘనమైన క్రీస్తు||
కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి వలబడ్డ చేఁపవలె వదల కని పలికెన్ సిలువపై నసు విచ్చి బలహీన మెడలించి వలవలను కన్నీరు వల పోసినాఁడు ||ఘనమైన క్రీస్తు||
పర్వతములపైఁ గట్టు పట్టణమువలె నిన్ను నుర్విలో నుంచితి నుచి తంబుగాను సర్వజనులకు వెలుఁగు సాక్షిగా నీవుండి గర్వింప వలదనుచు ||ఘనమైన క్రీస్తు||
సదమలం బగు జ్ఞాన సరణి యిదె నా మాట ముదముతో నమ్మినను మోక్ష మోసఁగెదను కదిసి సాతాను బలు కాడిక్రిందను బడిన విదలించి నరకమున వేతునని పలికెన్ ||ఘనమైన క్రీస్తు||