మా యేసు క్రీస్తుని మఱుఁగు
maa yeesu kreestuni marrungu
మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షా నగమ నెక్కెను రా ||మా యేసు||
ముందు నాలో పాప ములు జూడఁ బడెరా డెందము తా నన్ని టిని నొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మఁ జెందెనురా సందేహములు వీడు జాడఁ గన్గొనెరా ||మా యేసు||
సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటు వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగు వేల్పు ల్విష మైరిగదా ||మా యేసు||
బాధగురువుల మోము ల్బహు లజ్జఁబడెరా గాధ మంత్రము లన్ని కడగండ్లయి చెడెరా శోధించి నాయాత్మ శుద్ధిగోరెనురా సాధించి ప్రభుక్రీస్తు శరణుఁ జొచ్చెనురా ||మా యేసు||
మతిలోని లోఁతు మ ర్మము గానఁబడెరా మితలేని ఘనపాప మే నిండు కొనెరా హితముగా తన జీవ మిచ్చె క్రీస్తుఁడురా మృతిచేత మన పాప వితతి గొట్టెనురా ||మా యేసు||
కులగోత్రముల బుద్ధి కుటిలంబుఁ దెగెరా బలవత్పిశాచ శృం ఖలము విఱిగెనురా సిలువ మోసినవాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన నిలచి యున్నదిరా ||మా యేసు||
తనపోల్కె నొరులఁ గ న్గొనఁ బ్రేమయ్యెనురా మనసు దేవునికి న ర్పణ సేయఁ బడెరా ఘన కృపశాంతులు గొనెను నెమ్మదిరా మనసు మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా ||మా యేసు||