మరణమునకు విజయ మేది మరణ

maranamunaku vijaya meedi marana

🎵 AKK-495💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణమునకు విజయ||

1వ చరణం

క్షయమందు విత్తఁబడి య క్షయమునందు లేచురా ప్రియుడు క్రీస్తునందు మృతులు పెం పొసంగు ధన్యులు ||మరణమునకు విజయ||

2వ చరణం

లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను యేసు ప్రేమతో దాఁటించురా ||మరణమునకు విజయ||

3వ చరణం

ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము పరమ దేవుని డుండునట్టి పరదైసునకుఁ బోదుము ||మరణమునకు విజయ||

4వ చరణం

గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల నొక్క క్షణములో బ్రతికించురా ||మరణమునకు విజయ||

5వ చరణం

బూర రావ మాలకించి భూమి యెల్ల వణఁకురా వారధిలో మృతులు జీవ ధారులై లేచెదరురా ||మరణమునకు విజయ||

6వ చరణం

భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు ముర్తి కిరీటము ధరించి రక్తితో జీవింతురు ||మరణమునకు విజయ||

7వ చరణం

కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుఁడి మరణవిజయుఁడైన ప్రభుని చరణములు నుతించుఁడీ ||మరణమునకు విజయ||

Report Error