శృంగార ద్వారంబు మా యేసు
shrungaara dvaaranbu maa yeesu
పల్లవి
శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున కెంతో శృంగార ద్వారము ||శృంగార ద్వారంబు||
1వ చరణం
పాలును దేనెయుఁ బారెడి కానాను ప్రదేశ భూములకుఁ బ్రవేశ పెట్టు ||శృంగార ద్వారంబు||
2వ చరణం
యెరూషలేమాలయ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ జనులుగ బ్రవేశ పెట్టు ||శృంగార ద్వారంబు||
3వ చరణం
అత్యంత పరిశుద్ధ స్థలమందు మమ్ము నిత్యంబు యాజ కులగాను జేర్చు ||శృంగార ద్వారంబు||
4వ చరణం
ఇరుకైన నేమది సరియైన ద్వారంబు సంకటంబైనను సౌఖ్యన జేర్చు ||శృంగార ద్వారంబు||