పరములోన బరములోనఁ పాప మేమి

paramuloona baramuloonan paapa meemi

🎵 AKK-503💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా నరయ దానిఁ గోరు వారి కాశ యిందు లేదుగా ||పరములోన బరములోనఁ||

1వ చరణం

వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు స్వామి సేవ గల్గుగా ||పరములోన బరములోనఁ||

2వ చరణం

ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకుఁ గంటి నీళ్లు దుడుచుఁగా ||పరములోన బరములోనఁ||

3వ చరణం

అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుఁగు వెలుగు నట్లు స్వామి సన్నిధి యుండుఁగా ||పరములోన బరములోనఁ||

4వ చరణం

దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పుఁ దీర్చి క్రీస్తుఁ ఆశ్రయముగ నిల్చుఁగా ||పరములోన బరములోనఁ||

5వ చరణం

అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న మిగుల ఘనుని ప్రేమ గల్గుగా ||పరములోన బరములోనఁ||

Report Error