దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ
deevadeevuni goppa puramu paralookaanandamukraistava
దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ జీవితము యా పురము ||దేవదేవుని గొప్ప||
దేవుని పురము దేదీప్య కరము జీవ మందిరము జేగీయ గృహము ||దేవదేవుని గొప్ప||
పరిశుద్ధ పురము పరమార్థ కరము పరమ మందిరము పరదైసు పురము ||దేవదేవుని గొప్ప||
ఆనంద పురము ఆది నిరంతరము కాన దుస్తరము ఘన మనోహరము ||దేవదేవుని గొప్ప||
శృంగార పురము సుర చిర కరము బంగారు మెరము ప్రభల భాసురము ||దేవదేవుని గొప్ప||
వైభవ పురము వంద్య మప్పురము సౌభాగ్య కరము స్ఫటిక మందిరము ||దేవదేవుని గొప్ప||
కెంపు పాండురము కీర్తి బంధురము ఇంపౌ నగరము ఇదియే సుస్థిరము ||దేవదేవుని గొప్ప||
క్షుదలేని పురము సుక్షేమ కరము ముదము విస్తరము రొదలు దుస్తరము ||దేవదేవుని గొప్ప||
ఆశ్చర్య పురము ఆశ్రయ కరము నిశ్చయపరము నిజదేవ పురము ||దేవదేవుని గొప్ప||
మాణిక్య పురము మణుల గోపురము వీణెలు స్వరము విన మనోహరము ||దేవదేవుని గొప్ప||
సూర్యభాసురము చొరనట్టి పురము కార్య మబ్బురముఁ గావించు గరము ||దేవదేవుని గొప్ప||
సీయోను పురము శ్రేయస్సాగరము మాయ విధురము మరి సంపత్కరము ||దేవదేవుని గొప్ప||
ఇచ్చు నిబ్బరము యెరుషలేం పురము మెచ్చౌ నబ్బురము మెరయు మా పురము ||దేవదేవుని గొప్ప||