ఏదియది యేదియది యేదిరా మన

eediyadi yeediyadi yeediraa mana

🎵 AKK-511💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు బహుళ దుఃఖ పాశము ||ఏదియది యేదియది||

1వ చరణం

సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి పరమ కానాన్ దేశము ||ఏదియది యేదియది||

2వ చరణం

ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల శ్రీకరుని నివాసము ||ఏదియది యేదియది||

3వ చరణం

జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు బుల స్వదేశము ||ఏదియది యేదియది||

4వ చరణం

యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా మృతములిడు దేశము ||ఏదియది యేదియది||

5వ చరణం

కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని స్ధిరతఁ బూని యుంటిరా ||ఏదియది యేదియది||

6వ చరణం

మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి దాని దాటిపోవ నుంటిరా ||ఏదియది యేదియది||

7వ చరణం

కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా మేర దాట లేకరా ||ఏదియది యేదియది||

Report Error